News September 12, 2025
విజయవాడ: 163కి చేరిన డయేరియా కేసులు

విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇప్పటి వరకు మొత్తం 163 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిశ శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ప్రస్తుతం 92 మంది చికిత్స పొందుతుండగా, 71 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. డయేరియా బాధితులకు ప్రభుత్వం సరైన సమయంలో సరైన చికిత్స అందిస్తుందని ఆయన వివరించారు.
Similar News
News December 17, 2025
ఉమ్మడి కరీంనగర్‌లో 1,27,920 మంది ఓటర్లు

లోకల్ వార్ ఫైనల్‌కు చేరింది. నేటితో ఎన్నికల సంగ్రామం ముగియనుంది. ఉమ్మడి కరీంనగర్‌లో 1,27,920మంది ఓటర్లు ఉండగా 388 GPలకు, 1580 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. కరీంనగర్‌లో 80,190మంది మహిళలు, 84,853మంది పురుషులు, పెద్దపల్లిలో 73,669మంది మహిళలు, 70,892మంది పురుషులు, సిరిసిల్లలో 61,928మంది మహిళలు, 65,992మంది పురుషులు, జగిత్యాలలో 89,959మంది మహిళలు, 85,061మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 17, 2025
30కి పైగా దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇటీవల 12 దేశాలపై విధించగా, ఇప్పుడు ఆ సంఖ్య 30కి పైనే ఉంది. పాలస్తీనా, సిరియా, జింబాబ్వే సహా అనేక దేశాలు ఈ లిస్ట్‌లోకి వచ్చాయి. ఇమ్మిగ్రేషన్‌పై కఠిన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ దేశ పౌరుల రికార్డుల విషయంలో నమ్మకం లేకపోవడంతో పాటు అవినీతి, క్రిమినల్ కేసులు వంటివి కారణాలుగా పేర్కొన్నారు.
News December 17, 2025
SRCL: ఫర్టిలైజర్ యాప్‌పై అవగాహన సదస్సు

రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్‌పై అవగాహన కల్పించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఫెర్టిలైజర్ యాప్‌పై అవగాహన, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణ లక్ష్యాల సాధన గురించి వివరించాలన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, వ్యవసాయ శాఖాధికారి అఫ్టల్ బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


