News September 13, 2025

విజయవాడ: CRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

CRDA ఇంజినీరింగ్ విభాగంలో 102 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అసిస్టెంట్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 25 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 15 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, చీఫ్(4), సూపరింటెండెంట్ ఇంజినీర్(8) పోస్టులు భర్తీ చేస్తున్నామని.. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కన్నబాబు తెలిపారు. దరఖాస్తు వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలన్నారు.

Similar News

News December 7, 2025

ఫ్యూచర్ సిటీ విజన్.. ఆర్థిక లక్ష్యాలు ఇవే!

image

*రాష్ట్ర సుదీర్ఘకాల ఆర్థిక ప్రణాళికనే ఫ్యూచర్ సిటీ
*విజన్-2047 ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం
*దేశంలో మొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ
*FCDA ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలు
ఇన్నోవేషన్, పారిశ్రామిక హబ్‌లు BFCలో కీలకం. AI, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఫిన్‌టెక్, ఎలక్ట్రానిక్స్ తయారీతో పాటు వేలాది మంది ఉపాధి. 30K ఎకరాలను నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వినోద, Green జోన్‌లుగా విభజించారు.

News December 7, 2025

తిరుపతి: వారిపై గతంలోనూ ఆరోపణలు ఉన్నాయా..?

image

NSUలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అ.ప్రొఫెసర్లు మాజీ VC మురళీధర్ శర్మ హయాంలో విధుల్లో చేరారు. వీరిలో లక్ష్మణ్(మహారాష్ట్ర), శేఖర్ రెడ్డి (AP)కి చెందిన వారు. లక్ష్మణ్‌పై గతంలో యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయట. మరి ఇలాంటి వ్యక్తి ఏమి చేయలేదంటే ఎలా నమ్ముతారన్నది కొందరి వాదన. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వర్సిటీ అధికారులదే.

News December 7, 2025

తిరుపతి: మరో ప్రొఫెసర్‌‌ది అదే డిపార్ట్మెంట్.!

image

తిరుపతి NSUలో యువతిపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్‌లో పని చేస్తున్నారు. వీడియో తీసి బెదిరింపులకు దిగినట్లు ఆరోపిస్తున్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ అదే విభాగానికి చెందిన శేఖర్ రెడ్డి అన్న చర్చ నడుస్తోంది. అతను ‘నాకు సంబంధం లేకుండా నా పేరు తెచ్చారు’ అని సిబ్బందితో మట్లాడినట్లు సమాచారం.