News January 16, 2026

విజయ్‌ హజారే ట్రోఫీ.. పైనల్‌కు దూసుకెళ్లిన విదర్భ

image

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ క్రికెట్ జట్టు కర్ణాటకపై ఘన విజయాన్ని సాధించి ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 280 పరుగులు చేసింది. దర్శన్ నల్కాండే ఐదు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌లో విదర్భ యువ బ్యాటర్ అమన్ మొఖాడే 138 రన్స్‌తో సత్తా చాటారు. మరోవైపు ఈరోజు పంజాబ్-సౌరాష్ట్ర మధ్య మరో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో విజయం సాధించిన టీమ్ 18వ తేదీన విదర్భతో ఫైనల్‌లో తలపడనుంది.

Similar News

News February 18, 2026

వరి పంటలో ఎలుకల నిర్మూలనకు అనుకూల సమయం ఏది?

image

వరిలో నాట్లు వేసిన తర్వాత ఎలుకల నిర్మూలన చేపట్టడం సులభమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో బుట్టలను పెడితే ఎలుకలను సులభంగా నిర్మూలించవచ్చంటున్నారు. పంట చిరుపొట్ట దశలో ఎలుకల నిర్మూలన కష్టంగా మారుతుందని, ఈ సమయంలో బుట్టలతో వాటిని అరికట్టలేమని చెబుతున్నారు. చిరు పొట్ట దశలో ఎలుక కన్నాలను గుర్తిస్తే, పొగ బెట్టడం ద్వారా వాటిని కంట్రోల్ చేయొచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News February 18, 2026

స్నాక్స్ లాగించేస్తున్నారా?

image

దాదాపు 76% మంది భారతీయులకు రోజుకు రెండుసార్లైనా స్నాక్స్ తినే అలవాటు ఉంది. బిస్కెట్స్, చిప్స్, షుగరీ ఫుడ్స్, డ్రింక్స్ వంటివి తీసుకోవడం వల్ల జీవక్రియపై ఒత్తిడి పడుతుంది. డయాబెటిస్ రిస్క్ పెరిగి, ఆయుష్షుపైన ప్రభావం పడుతుంది. భారతీయుల జీవనశైలికి ప్రొటీన్, ఫైబర్, సరిపడా కార్బ్స్ ఉండే బ్యాలెన్స్‌డ్ మీల్స్ రోజులో 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుందని.. స్నాక్స్ అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.

News February 18, 2026

భర్త పర్మిషన్ లేకుండా బంధువుల ఇంటికెళ్తే 3 నెలల జైలు శిక్ష!

image

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా సరికొత్త క్రిమినల్ కోడ్‌ ఇటీవల అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళ్తే మహిళలకు 3 నెలల జైలు శిక్ష పడుతుంది. అలాగే భార్యలు, పిల్లలను భౌతికంగా శిక్షించే అధికారం భర్తలు, తండ్రులకు ఉంటుంది. అయితే, ఎముకలు విరగొద్దు. చర్మంపై ఏమాత్రం గాట్లు పడొద్దు. ఒకవేళ గాయాలైనట్లు ఆధారం ఉంటే మహిళ కోర్టును ఆశ్రయించొచ్చు.