News November 7, 2025

విటమిన్స్ లోపం-లక్షణాలు

image

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతూ ఉంటుంది. నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్, ఐరన్, బి విటమిన్లు (నయాసిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ బి12) లోపం. చర్మంపై రాషెస్‌, జుట్టు రాలడం ఉంటే బయోటిన్ (విటమిన్ బి7) లోపం. చేతులు, పాదాల్లో చురుక్కుమనడం, తిమ్మిర్లుంటే బి విటమిన్ల (ఫోలేట్, బి6, బి12)లోపమని అర్థం చేసుకోవాలి. కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం లోపమని గుర్తించాలి.

Similar News

News January 13, 2026

చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలడంతో కన్ను కోల్పోయిన చిన్నారి!

image

చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలడంతో ఓ చిన్నారి చూపు కోల్పోయాడు. ఒడిశాలోని టిట్లాగఢ్‌లో అంకేశ్(8) చిప్స్‌ ప్యాకెట్‌లో వచ్చిన టాయ్‌తో ఆడుకుంటూ వంటింట్లోకి వెళ్లాడు. ఆ బొమ్మ స్టవ్‌పై పడి పేలిపోయింది. దీంతో అతడి కంటికి తీవ్ర గాయమై చూపు కోల్పోయాడు. గతనెలలో కంధమల్(D)లో చిప్స్ ప్యాకెట్‌లోని టాయ్ మింగి 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడు. ఇలాంటి టాయ్స్ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News January 13, 2026

IT కంపెనీల లాభాలకు గండి.. కారణమిదే

image

కొత్త లేబర్ కోడ్‌ల వల్ల IT కంపెనీల లాభాలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా వేతనంలో బేసిక్ పే 50% ఉండాలనే నిబంధన.. దీనివల్ల PF, గ్రాట్యుటీ ఖర్చులు పెరగడం సంస్థలకు భారంగా మారింది. అలాగే ఏడాదికే గ్రాట్యుటీ చెల్లింపు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కోసం కంపెనీలు భారీగా నిధులను కేటాయించాల్సి వచ్చింది. ఈ అదనపు వ్యయాలే TCS, HCL వంటి కంపెనీల నికర లాభాలను తగ్గించాయి. అయితే ఇది ఈ క్వార్టర్‌కే పరిమితమని నిపుణులు తెలిపారు.

News January 13, 2026

ముంబై టార్గెట్ ఎంతంటే?

image

WPL-2026లో ముంబైతో మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 192/5 స్కోరు చేసింది. ఓపెనర్ డివైన్(8) విఫలమవ్వగా మూనీ(33) ఫర్వాలేదనిపించారు. చివర్లో ఫుల్మాలి 15 బంతుల్లో 36 రన్స్ చేయగా, జార్జియా(43) తోడ్పాటునందించారు. ముంబై బౌలర్లలో ఇస్మాయిల్, మాథ్యూస్, కేరీ, అమేలియా తలో వికెట్ తీశారు. MI టార్గెట్ 193.