News January 22, 2026
విటమిన్ B12 లోపాన్ని నిర్లక్ష్యం చేయకండి

రోజంతా అలసట, మూడ్ స్వింగ్స్, మర్చిపోవడం వంటివి సాధారణ సమస్యలే అనుకుంటున్నారా? కానీ ఇవి విటమిన్ B12 లోపానికి హెచ్చరికలు కావచ్చు. భారత్‌లో 15 శాతం కంటే ఎక్కువ మందికి ఈ లోపం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. B12 తక్కువైతే అలసట, నరాల బలహీనత, నడవడంలో ఇబ్బంది, నోటిలో పుండ్లు, దృష్టి సమస్యలు, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మాంసాహారం, చేపలు, గుడ్లు, పాలు తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు.
Similar News
News February 15, 2026
నేడు శివరాత్రి.. ఏ రంగు దుస్తులు ధరించాలంటే?

మహా శివరాత్రి రోజున డార్క్ రంగు దుస్తులు ధరించకపోవడం ఉత్తమం అంటున్నారు పండితులు. నలుపు, నీలి రంగు దుస్తులు ధరించడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ రంగులు ప్రతికూల ప్రభావం చూపుతాయట. అలాగే వీటితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. శివరాత్రి రోజు పూజ చేసే సమయంలో తెలుపు/పసుపు రంగు దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఇలా పూజ చేస్తే శివానుగ్రహం కలిగి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.
News February 15, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో 40 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 15, 2026
కెప్టెన్సీ నుంచి ధోనీని బలవంతంగా తప్పించిన బీసీసీఐ!

2017లో భారత జట్టు కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడానికి గల కారణాలను మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపే తాజాగా వెల్లడించారు. కెప్టెన్‌గా దిగిపోవాలని అప్పటి చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్, తాను కోరినట్లు తెలిపారు. అందుకు MS అంగీకరించారని, రాతపూర్వకంగా తెలియజేయాలని కోరితే ఈమెయిల్ పంపారని చెప్పారు. ఆ తర్వాత కోహ్లీకి మద్దతుగా నిలిచారని కొనియాడారు. 2014లో టెస్టులకు, 2020 ODI, T20లకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించారు.


