News November 17, 2024
విద్యార్థిని ఆత్మహత్యపై నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్
నరసరావుపేట భావన కళాశాల ఇంటర్ విద్యార్థిని అనూష ఆత్మహత్యపై ఆదివారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి నివేదికను కోరారు. పోలీస్ శాఖ, విద్యాశాఖ సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను తక్షణమే పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దురదృష్టకరమైన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసి తల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు.
Similar News
News December 5, 2024
గుంటూరు మిర్చి యార్డ్ తరలింపు
200 ఎకరాల్లో, అత్యాధునిక సౌకర్యాలతో నూతన మిర్చి యార్డును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నడుస్తున్న గుంటూరు మిర్చి యార్డ్‌పై అనేక విధాలుగా ఒత్తిడి పడుతోందని చెప్పారు. అందరి అభిప్రాయం మేరకు యార్డును తరలిస్తామన్నారు. ఆ స్థలాన్ని వేరే ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని ప్రకటించారు.
News December 5, 2024
పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా: అంబటి
పుష్ప-2 సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అల్లు అర్జున్ అభిమానులు బుధవారం రాత్రి నుంచి థియేటర్ల వద్ద రచ్చ రచ్చ లేపుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సినిమాపై స్పందించారు. ‘పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా కాదు వరల్డ్ ఫైర్’ అంటూ తన X ఖాతాలో రాసుకొచ్చారు.
News December 5, 2024
మంగళగిరిలో ఎర్రచందనం పట్టివేత
మంగళగిరి మండలం కాజ టోల్ ప్లాజా వద్ద బుధవారం రాత్రి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 10 చక్రాల లారీలో ఎవరికి అనుమానం రాకుండా A4 పేపర్ బండిల్స్ మధ్యన సుమారు 50 దుంగలను దాచి తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. చెన్నై నుంచి అస్సాం… అస్సాం నుంచి చైనా దేశానికి ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం.