News September 12, 2025

విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ కళాశాలల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కనీసం 70 శాతం మార్కులు వచ్చేలా ఉపాధ్యాయులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. విద్యార్థులకు సరైన బోధన అందించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 8, 2025

KNR: ‘పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలి’

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు ఎన్.వెంకటేశ్వర్లు సూచించారు. కరీంనగర్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, ఏర్పాట్లు, భద్రత, సిబ్బంది సమన్వయం తదితర అంశాలను పరిశీలించారు. లోపాలున్న చోట వెంటనే సరిదిద్దాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News December 8, 2025

MHBD: తుది పోటీలో 468 సర్పంచ్ అభ్యర్థులు

image

MHBDజిల్లాలో మొదటి విడత మండలాలకు సంబంధించి సర్పంచ్, వార్డు స్థానాలకు సంబంధించి ఏకగ్రీవంతో పాటు, తుది పోటీలో ఉన్నవారి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో మొదటి విడత మండలాలు గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, MHBD, నెల్లికుదురు మండలాల్లో 9 సర్పంచ్, 266 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 468 సర్పంచ్ అభ్యర్థులు, 2421మంది వార్డు సభ్యులు తుది పోటీలో ఉన్నారు. డిసెంబర్ 11న ఎన్నికలు జరగనునున్నాయి.

News December 8, 2025

నేపాల్‌లో అతిపెద్ద అవినీతి కేసు.. ఫేక్ బిల్లులతో!

image

నేపాల్‌లో చైనా నిర్మించిన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అవినీతి జరిగింది. దీనిని $216 మిలియన్లతో పూర్తి చేయగా ఇందులో $74M(రూ.600కోట్లు) అవినీతి జరిగినట్లు విచారణలో తేలింది. చైనా కాంట్రాక్టర్‌తో ఏవియేషన్ అధికారులు, మాజీ మంత్రులు(5) కుమ్మక్కై ఫేక్ బిల్లులతో ప్రాజెక్ట్ వ్యయాన్ని $74M పెంచారు. కాగా ఇలా ఫేక్ బిల్లులతో వ్యయాన్ని పెంచి ప్రజలపై అప్పుల భారాన్ని పెంచుతున్నారనే చర్చ జరుగుతోంది.