News November 19, 2025
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి: డీఈఓ

విద్యార్థులకు నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించి వారికి బంగారు భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని డీఈఓ జనార్ధన్రెడ్డి సూచించారు. మంగళవారం క్రిష్టిపాడు, దొర్నిపాడు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించి, విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేశారు. పాఠశాల పనితీరు, విద్యార్థుల క్రమశిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News January 23, 2026
కేసీఆర్ చుట్టే ప్రశ్నలు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRను HYD సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ బృందం రెండు గంటలుగా ప్రశ్నిస్తోంది. కాగా పదే పదే కేసీఆర్ చుట్టే ఆయన్ను ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌కు పర్మిషన్ ఇచ్చిందెవరు? ఎవరు చేయమని చెప్పారు? అనే ప్రశ్నలతో పాటు ట్యాపింగ్‌కు కేసీఆర్ కారణమా? అనే యాంగిల్‌లో ప్రశ్నలు సంధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
News January 23, 2026
ధర్మపురి: మేడారం జాతరకు గవర్నర్‌కు మంత్రి ఆహ్వానం

హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో నేడు జరిగిన భేటీలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మేడారం జాతరకు హాజరుకావాలని ఆహ్వానించారు. మేడారం జాతర ప్రాముఖ్యత, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని మంత్రి వివరించారు. జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలపై కూడా చర్చ జరిగింది. గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
News January 23, 2026
సహాయక పరికరాలకు దివ్యాంగుల దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు సహాయక పరికరాల కోసం ఈ నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత కోరారు. ఆసక్తి గలవారు సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు తదితర ధ్రువపత్రాలతో ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లావ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


