News November 19, 2025

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి: డీఈఓ

image

విద్యార్థులకు నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించి వారికి బంగారు భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని డీఈఓ జనార్ధన్రెడ్డి సూచించారు. మంగళవారం క్రిష్టిపాడు, దొర్నిపాడు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించి, విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేశారు. పాఠశాల పనితీరు, విద్యార్థుల క్రమశిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News January 20, 2026

VZM: ప్రేమ పేరుతో బాలికను మోసం.. 20 ఏళ్ల జైలు

image

ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను మోసం చేసిన కేసులో నిందితుడికి పోక్సో ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. రూ.3,000 జరిమానాతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని మంగళవారం తీర్పునిచ్చింది. బొబ్బిలి (M) గొల్లపల్లి గ్రామానికి చెందిన సింగారపు అజయ్ అనే యువకుడు బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తేలడంతో శిక్ష ఖరారైందని SP దామోదర్ తెలిపారు.

News January 20, 2026

జగిత్యాల: కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ తనిఖీ

image

జగిత్యాల జిల్లాలో జరగనున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో భద్రత, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూములు, బ్యారికేడ్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.

News January 20, 2026

సిరిసిల్ల: ‘మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి’

image

పురపాలక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్దతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.