News March 14, 2025

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి: కలెక్టర్

image

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కొండాపూర్ లోని వసతి గృహంలో మధ్యాహ్న భోజనాన్ని గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. భోజనం రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈఓ దశరథ్, అధికారులు ఉన్నారు.

Similar News

News February 19, 2026

గుంటూరు మిర్చి యార్డులో సరకు రాక పెరుగుదల

image

గుంటూరు యార్డుకు మిర్చి టిక్కీల రాక బుధవారం పెరిగింది. మొత్తం 1,06,635 టిక్కీలు రైతులు తీసుకురాగా 1,02,831 విక్రయాలు జరిగాయి. నాణ్యతను బట్టి క్వింటాల్‌కు రూ.17,500 నుంచి రూ.24,500 వరకు ధర లభించింది. తక్కువ క్వాలిటీ సరకుకే ధర తగ్గిందని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. ఉదయం ఒప్పుకున్న ధరకే బిడ్డింగ్ చేయాలని అధికారులు కమిషన్ దుకాణాలకు సూచించారు. ఎగుమతి వ్యాపారులపై వచ్చిన ఫిర్యాదులపై పర్యవేక్షణ పెంచారు.

News February 19, 2026

ట్రంప్ ఆదేశమే ఆలస్యం.. ఇరాన్‌పై దాడికి US ఆర్మీ సిద్ధం: CNN

image

ఇరాన్‌పై దాడి చేసేందుకు అమెరికా మిలిటరీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ వీకెండ్‌లోనే అటాక్ చేసే ఛాన్స్ ఉందని CNN తెలిపింది. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మిడిల్ ఈస్ట్‌లో US తన అతిపెద్ద ఎయిర్ పవర్‌ను మోహరించినట్లు పేర్కొంది. ట్రంప్ తన అడ్వైజర్లతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్‌గా ఈ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News February 19, 2026

అమెరికా అమ్మాయి.. తిరుపతి అబ్బాయి లవ్

image

తిరుపతికి చెందిన BSNL రిటైర్డ్ ఉద్యోగి రాజేంద్రన్ పెద్ద కుమారుడు రికీ జోసెఫ్(35) ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడే PhD పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతడికి అమెరికా యువతి బ్రాండీ నొయెల్ల జెడ్(30)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమె MS చదివి ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఇరుకుటుంబాల పెద్దలు వారి ప్రేమను అంగీకరించడంతో బుధవారం వారికి ఎంగేజ్‌మెంట్ జరిగింది.