News August 13, 2025
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: కామారెడ్డి కలెక్టర్

మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మాదక ద్రవ్యాల దుర్వినియోగం’ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా తమ భవిష్యత్తును సక్రమ మార్గంలో నిర్మించుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆయన తెలిపారు.
Similar News
News March 15, 2026
సరదా కోసం మరోసారి దాడి చేస్తాం: ట్రంప్

ఇరాన్‌లోని <<19378419>>ఖర్గ్<<>> ద్వీపంపై కేవలం ఫన్ కోసమే తాము మరిన్ని దాడులు చేయొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ తమతో డీల్‌కు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని, కానీ కండీషన్లే సరిగ్గా లేవని విమర్శించారు. ‘ఖర్గ్‌లోని చాలా భాగాన్ని పూర్తిగా నాశనం చేశాం. మేం వినోదం కోసం మళ్లీ అటాక్స్ చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ బతికే ఉన్నారా’ అని ప్రశ్నించారు.
News March 15, 2026
విశాఖలో చికెన్ రూ.310

విశాఖలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.170, స్కిన్ లెస్ రూ.310, విత్ స్కిన్ రూ.320, శొంఠ్యాం కోడి రూ.340గా కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా మటన్ కేజీ రూ.1000. డజన్ గుడ్లు రూ.60 పలుకుతున్నాయి. చేపలు, రొయ్యల అమ్మకాలు అప్పుఘర్, ఫిషింగ్ హార్బర్, మల్కాపురం, శ్రీహరిపురం, గాజువాక, తదితర ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది.
News March 15, 2026
భువనగిరి జిల్లాకు 190 యూనిట్లు మంజూరు: కలెక్టర్

షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళిక (2025-26) కింద జిల్లాకు 190 బ్యాంకు సంబంధిత యూనిట్లు మంజూరైనట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. రూ.382 లక్షలతో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని శనివారం పేర్కొన్నారు. ఈ పథకానికి అర్హతగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


