News August 13, 2025

విద్యా శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేసిన ఎంపీ కావ్య

image

కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్‌‌ను ఎంపీ కడియం కావ్య కలిసి వినతిపత్రం అందజేశారు. భూపాలపల్లి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం, జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారని, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అవసరమని, వెంటనే విద్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News March 13, 2026

బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’

image

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ చేపట్టనున్నారు. ఉదయం 7 గంటలకు మహాశక్తి ఆలయం వద్ద ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో బీజేపీకి చెందిన 108 మంది సర్పంచులు, 450 మంది వార్డు సభ్యులు, మేయర్, కౌన్సిలర్లు సహా ప్రజాప్రతినిధులు, వేలాదిగా కార్యకర్తలు పాల్గొననున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణతో సాగాలని సంజయ్ శ్రేణులకు సూచించారు.

News March 13, 2026

కరీంనగర్ పీటీసీలో పాసింగ్ అవుట్ పరేడ్

image

కరీంనగర్‌లోని స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రం (PTC)లో 2025–2026 బ్యాచ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ వైభవంగా జరిగింది. ఈ శిక్షణలో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి TGSP కానిస్టేబుల్ గోగికర్ రోహన్ ‘ఆల్ రౌండర్’ అవార్డును కైవసం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్యఅతిథిగా హాజరై రోహన్‌కు ట్రోఫీని అందజేసి, ప్రత్యేకంగా అభినందించారు.

News March 13, 2026

గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి

image

గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. అపోహలను సృష్టించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలతో సమీక్ష నిర్వహించారు. ములుగు కలెక్టర్ దివాకర టి.ఎస్ పాల్గొన్నారు.