News March 13, 2025

విద్యుత్ షాక్‌కు గురై ఆరేళ్ల చిన్నారి మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. డి.హీరేహాళ్ మండలం మురిడికి చెందిన 6ఏళ్ల చిన్నారి అర్పిత స్నానం చేసేందుకు వెళ్తుండగా డోర్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహించి పడిపోయింది. గమనించిన తల్లి రూతమ్మ వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆ ఇంట విషాదం నింపింది.

Similar News

News February 16, 2026

FLASH: NZB మేయర్‌గా కూరగాయల ఉమారాణి

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్‌గా కాంగ్రెస్ నుంచి 49వ డివిజన్‌లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆమె భర్త కరాటే రమేశ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. ఎన్నికకు హాజరైన మెజారిటీ సభ్యులు ఆమెకు మద్దతు తెలిపారు. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆమెకు ఎక్స్ అఫీషియోగా ఓటు వేశారు.

News February 16, 2026

కర్నూలు జిల్లాలో యూరియా కొరత లేదు

image

కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌కు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. ఇప్పటివరకు 18,168 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, ప్రస్తుతం 5,897 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఎరువుల కొనుగోలు సమయంలో ఎంఆర్పీ ప్రకారం చెల్లించి, రశీదు తీసుకోవాలని రైతులకు సూచించారు.

News February 16, 2026

నిర్మల్‌లో రికార్డ్.. భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్

image

నిర్మల్ మున్సిపాలిటీ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య, వైస్‌ ఛైర్మన్‌గా ఆమె భర్త అప్పాల గణేష్ చక్రవర్తి సోమవారం ప్రమాణం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు మున్సిపల్ కీలక పదవులను దక్కించుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బలపరిచిన ఈ జంట ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.