News March 5, 2025
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

భద్రాద్రి కొత్తగూడెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దమ్మపేటలో ఇస్త్రీ చేస్తుండగా కోకిల(28) అనే మహిళ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చికిత్స కోసం సత్తుపల్లి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 15, 2025
కొడుతూ పోలీసులు టార్చర్ చేస్తున్నారు: నటి

కస్టడీలో తనపై భౌతిక దాడి జరుగుతోందని నటి రన్యారావు ఆరోపించారు. పోలీసులు పలుమార్లు తనను కొట్టారని, ఆహారం ఇవ్వడం లేదని ఆమె జైలు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. తెల్ల కాగితాలపై సైన్ చేయాల్సిందిగా DRI అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తనకేమీ తెలియదని, తప్పుడు కేసులో ఇరికించారని అన్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఆమె అరెస్టవ్వడం తెలిసిందే. CBI, ED సైతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.
News March 15, 2025
కొత్తపల్లి: పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

కొత్తపల్లి మండలంలోని నిడ్జింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం సరైన సమయానికి అందుతుందా లేదా అని ఆరా తీశారు. అల్పాహారం నాణ్యత లేకుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. తద్వారా మధ్యాహ్న భోజనం అందించాలని చెప్పారు.
News March 15, 2025
నెల్లూరు: 174 పరీక్షా కేంద్రాలు.. 33,434 మంది విద్యార్థులు

సంగం జడ్పీ హైస్కూల్‌ను శనివారం డీఈవో సందర్శించారు. పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈవో బాలాజీ రావు మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యుత్ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 174 పరీక్షా కేంద్రాలలో 33,434 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు.