News August 14, 2025
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం: కలెక్టర్

వసతి గృహాల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. తణుకులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు వసతి గృహంలోకి చేరిన నీటిని పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం ఉపేక్షించబోమని, ఏ సమస్య ఉన్నా వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
Similar News
News March 16, 2026
ప.గో: మళ్లీ పాత చోటకే PGRS వేదిక

గొల్లల కోడేరు జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) యథావిధిగా నిర్వహించనున్నట్లు SP అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గతంలో రోడ్డు పనుల వల్ల భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగేదని, పనులు పూర్తి కావడంతో తిరిగి SP కార్యాలయానికి మార్చినట్లు వెల్లడించారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి తమ సమస్యల విన్నపానికి నేరుగా SP కార్యాలయానికి రావాలని కోరారు.
News March 16, 2026
ప.గో: సీఆర్పీలకు ఐదు నెలలుగా అందని వేతనాలు

పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాల్లో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నియమించిన సీఆర్పీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియామకమై ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు అందకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగ భద్రతపై అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో గందరగోళం నెలకొందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
News March 16, 2026
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.


