News May 7, 2025

వినుకొండలో బుల్లెట్ బైకు చోరీ

image

వినుకొండలో దావూద్ హోటల్ ముందు నిలిపిన (AP 39QQ 1408) రాయల్ ఎన్ఫీల్డ్ జీటీ 650 సీసీ చోరీకి గురైంది. గుర్తు తెలియని యువకుడు హోటల్‌కు వచ్చి టిఫిన్ చేసి కౌంటర్ వద్దకు వచ్చి తనది విజయవాడ అని పరిచయం చేసుకున్నాడు. తనకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టమని, ఓ సారి ట్రైల్ చూస్తానని చెప్పి తీసుకెళ్లినట్లు బాధితుడు రబ్బాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News February 16, 2026

ఎన్నికల కోడ్ ఉపసంహరణ: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిను తక్షణమే ఉపసంహరించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసినందున మున్సిపాలిటీ పరిధిలో అమలులో ఉన్న ఎన్నికల నిబంధనలు ఇకపై వర్తించవని స్పష్టం చేశారు.

News February 16, 2026

ఖమ్మం: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన

image

ప్రేమించి మోసం చేశారంటూ ఓ యువతి ఇంటి ముందు బైఠాయించిన ఘటన కూసుమంచి మండలం ముత్యాల గూడెం గ్రామంలో జరిగింది. బూర్గంపాడు మండలానికి చెందిన ఓ యువతి ముత్యాలగూడెం గ్రామానికి చెందిన పగిళ్ల మనోజ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు నిరాకరించడంతో యువతి, కుటుంబ సభ్యులు మనోజ్ ఇంటిముందు బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News February 16, 2026

సంగారెడ్డి: పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో

image

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని సంగారెడ్డిలోని కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.