News December 1, 2025

విపత్తుల సమయంలో ముందస్తు జాగ్రత్తలపై శిక్షణ: కలెక్టర్

image

విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్ది అన్నారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్టరేట్‌ ఆవరణలో రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక సేవల శాఖ పరికరాలను ఆయన పరిశీలించారు. విపత్తుల కోసం గ్రామస్థాయిలో వాలంటీర్లను ఏర్పాటుచేసుకొని వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.

Similar News

News February 13, 2026

భీంగల్‌లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు: TPCCచీఫ్

image

భీంగల్ మున్సిపాలిటీ ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ విజయం ప్రజల ఆశయాల గెలుపు అని పేర్కొంటూ భీంగల్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.

News February 13, 2026

సభలో మోగిన అనంతపురం స్వరం!

image

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా మహిళా MLAలు పరిటాల సునీత, బండారు శ్రావణి, పల్లె సింధూరరెడ్డి గళమెత్తారు. ఆత్మకూరు, అనంతపురం మండలాల్లోని 50గ్రామాల్లో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని <<19129909>>సునీత<<>> డిమాండ్ చేశారు. శింగనమల నియోజకవర్గంలో అంగన్వాడీ భవనాలపై <<19129184>>శ్రావణి<<>>, శ్రీకృష్ణదేవరాయల జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని <<19127732>>సింధూర<<>> ప్రభుత్వాన్ని కోరారు.

News February 13, 2026

15 మంది బాలలకు విముక్తి: బాపట్ల కలెక్టర్

image

బాల కార్మిక నిర్మూలన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం తెలిపారు. జిల్లాలో బాల కార్మికులు ఉండరాదన్నారు. బాల కార్మికుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలించడమే అధికారుల లక్ష్యం కావాలన్నారు. రెస్క్యూ బృందాలు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. 14 సంవత్సరాలలోపు బాలలంతా కచ్చితంగా పాఠశాలల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 15 మంది బాలలకు విముక్తి కల్పించామన్నారు.