News September 11, 2025
విమానాశ్రయం ద్వారా ఎంతమంది ప్రయాణించారంటే.?

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా బుధవారం 42 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 21 సర్వీసుల ద్వారా 1,754 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 1,753 మంది 21 సర్వీసులలో ఇతర ప్రాంతాలకు ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను నిర్వహిస్తున్నామంది.
Similar News
News December 9, 2025
‘ఇండిగో’ సంస్థకు షాక్ ఇచ్చిన కేంద్రం

దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు, ఆలస్యంపై విమానయాన సంస్థ ఇండిగోకు కేంద్రం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇండిగోకు ఉన్న స్లాట్లలో 5% కోత విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రోజూ నడిచే సర్వీసులు కనీసం 110 వరకు తగ్గే అవకాశముంది. తగ్గించిన స్లాట్లు ఎయిర్ ఇండియా, ఆకాశ, స్పైస్‌జెట్ వంటి సంస్థలకు కేటాయించనున్నారు. ప్రయాణికుల అసౌకర్యం తగ్గించేందుకు ఈ చర్యలు కీలకమని DGCA పేర్కొంది.
News December 9, 2025
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 5 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంఎస్సీ ( మ్యాథ్స్, స్టాటిస్టిక్స్) నెట్/SLET పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పీజీ స్థాయిలో టీచింగ్ చేసిన అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://uohyd.ac.in/
News December 9, 2025
ప్రకాశం: లంచం అడిగితే.. ఈ నంబర్లకు కాల్ చేయండి.!

ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ACB అధికారులు కోరుతున్నారు. ACB DSP 9440446189, సీఐలు 9440446187, 8333925624, టోల్ ఫ్రీ 1064కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. కాగా నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం.


