News November 30, 2025
విలీనం తరువాత GREATER HYDERABAD AUTHORITY?

GHMC ఇక కనుమరుగు కానుందా.. విలీనం తరువాత ప్రభుత్వం పరిపాలనలో మార్పు తీసుకురానుందా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. మున్సిపాలిటీల విలీనం తరువాత పరిపాలన సజావుగా సాగేందుకు ప్రభుత్వం GREATER HYDERABAD AUTHORITY (GHA) ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. దాదాపు 10 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వీటిని GHA పరిధిలోకి తేవాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులు స్టడీ చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News February 11, 2026
HYD: ‘అ’క్షరం.. ‘ఆ’కలి దుఃఖంలో కలిశాయి!

పాఠశాల ముగియగానే పిల్లలు గంతులేసుకుంటూ ఇళ్లకు వెళ్లి ఆడుకుంటారు. కానీ, మాదాపూర్‌లోని ఈ చిన్నారి కథ వేరు. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా, నేరుగా తల్లి కూర్చునే ఫుట్‌పాత్ వద్దకు వెళ్తుందా పాప. చెప్పులు కుట్టడంలో తల్లికి సాయం చేస్తూ, కస్టమర్లు లేని సమయంలో హోంవర్క్ రాస్తోంది. చదవడానికి ఇంట్లో కనీస వసతులు లేకపోయినా, వీధి దీపాల వెలుతురులో చదువుతోంది. ఈ బుజ్జితల్లి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుందాం.
News February 11, 2026
GHMC స్పెషల్ ఆఫీసర్‌గా జయేశ్ రంజన్

తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్‌ను బాధ్యతలు స్వీకరించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ముగియడంతో పాలనా బాధ్యతల నిర్వహణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. GO 203 ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక నుంచి 3 కార్పొరేషన్ల బాధ్యతలు ఆయన చూసుకోనున్నారు.
News February 11, 2026
GHMCపై కొత్త బాస్‌ల సంతకం

GHMC 3 ముక్కలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. మల్కాజిగిరి కమిషనర్‌గా టి.వినయ్ కృష్ణారెడ్డిని, సైబరాబాద్ కమిషనర్‌గా సృజనతో స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ ఆధ్యర్యంలో బాధ్యతలు చేపట్టారు. అధికారులు, సిబ్బంది వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పారదర్శక పాలన, ప్రజాసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వారు పేర్కొన్నారు. నగర పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధికోసం పనిచేస్తామని తెలిపారు.


