News December 2, 2025

వివాహానికి నిజమైన అర్థం అదే: జయా బచ్చన్

image

ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కు పెళ్లి గురించి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సీనియర్ బాలీవుడ్ నటి జయా బచ్చన్ అన్నారు. ‘నేటి తరం పిల్లలకు మనం సలహాలు ఇవ్వలేం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు, అన్ని విషయాల్లో మనల్ని మించిపోయారు. అలాగే పెళ్లంటే ఇలానే ఉండాలి అని చెప్పడానికి సరైన నిర్వచనాలు లేవు. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలంతే’ అని జయ తెలిపారు.

Similar News

News February 11, 2026

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు కోల్పోయి 84,163 వద్ద.. నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 25,921 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, టైటాన్, మారుతీ, SBI షేర్లు లాభాల్లో.. HCL టెక్, ట్రెంట్, TCS, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు దిగుతున్నారు.

News February 11, 2026

బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

image

బీట్ రూట్‌లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.

News February 11, 2026

DRDOలో 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్(DIHAR) 25 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు ఫిబ్రవరి 24న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/BTech, GATE, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. వయసు 28 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. JRFకు నెలకు రూ.37,000, RAకు రూ.67,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in