News June 20, 2024

విశాఖను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: ఎమ్మోల్యే గణబాబు

image

విశాఖను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు పిలుపునిచ్చారు. కంచరపాలెం మెట్ట వద్ద విశాఖ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ అవేర్నెస్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలన్నారు. డీసీపీ ‌మేకా సత్తిబాబు మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

Similar News

News January 22, 2026

ఈ నెల 29న విడుదల కానున్న ఏపీ మత్స్యకారులు

image

బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులను ఈ నెల 29న విడుదల చేసి భారత్‌కు పంపనున్నట్లు Bangladesh Coast Guard ప్రకటించిందని ఈస్ట్ కోస్ట్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది ఉన్నారు. అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు.

News January 22, 2026

ఏయూలో పాలన గాడి తప్పిందా?

image

ఖరగ్‌పూర్‌ ఐఐటీలో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌‌ను ఏయూకి వీసీగా ప్రభుత్వం నియమించింది. అయితే వీసీ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులను కలుపుకొని ముందుకు వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఈడీ విద్యార్థి మృతి, వీసీని నేరుగా కలవొద్దంటూ సర్క్యులర్లు, తాజాగా ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు మెస్‌లో భోజనం నిలిపివేయడంతో వైఫల్యాలు కనిపిస్తున్నాయి.

News January 22, 2026

విశాఖ: జీవీఎంసీ సమావేశంలో కుప్పకూలిన ఇంజినీర్ మృతి

image

గాజువాక జీవీఎంసీ హాల్లో సమీక్ష జరుగుతుండగా కుప్పకూలిపోయిన సూపరింటెండెంట్ ఇంజినీర్ గోవిందరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం అధికారులు, ప్రజాప్రతినిధులు, జోనల్ కమిషనర్ సమక్షంలో సమావేశం జరుగుతుండగా గోవిందరాజు లేచి మాట్లాడే ప్రయత్నంలో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందు మృతి చెందారు.