News October 6, 2025
విశాఖలో ఆండ్రోత్ కమిషనింగ్ నేడే

ఇండియన్ నేవీలోకి సోమవారం మరో యుద్ధనౌక చేరబోతుంది. కోల్‌కతాలో నిర్మించిన ఐఎన్‌ఎస్ ఆండ్రోత్ యుద్దనౌకను నేవి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందక్కర్ సోమవారం కమిషనింగ్ చేయనున్నారు. సముద్ర జలాల్లో ఉన్న శత్రుదేశ సబ్ మెరైన్లను గుర్తించి నాశనం చేయగల సత్తా ఈ నౌకకు ఉంది. ఈ నౌక చేరికతో తూర్పు నౌకదళం భద్రతాపరంగా మరింత పటిష్టపడుతుందని నేవీ వర్గాలు తెలిపారు. ఆండ్రోత్ అనేది లక్షద్వీప్‌లోని ఓ ద్వీపకల్పం పేరు.
Similar News
News January 24, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 24, 2026
కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు అరెస్ట్!

ముంబైలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌పై కాల్పులు జరిగిన ఘటనలో బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్(KRK)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైరింగ్ చేసిన తుపాకీని సీజ్ చేశారు. తన లైసెన్స్‌డ్ గన్ నుంచి తానే కాల్పులు జరిపినట్లు ఆయన ఒప్పుకున్నారు. గన్‌ని క్లీన్ చేశాక టెస్ట్ చేసేందుకు 4 రౌండ్స్ ఫైర్ చేసినట్లు తెలిపారు. జనవరి 18న ఘటన జరగ్గా పోలీసులు దర్యాప్తు చేసి ఫైరింగ్ జరిపింది KRKగా గుర్తించారు.
News January 24, 2026
రూ.52 కోట్ల జరిమానాపై సంతృప్తి: బాపట్ల MP

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అధికారులు పూర్తిగా అరికట్టాలని MP తెన్నేటి కృష్ణ ప్రసాద్ సూచించారు. గడిచిన మూడేళ్లలో అక్రమ తవ్వకాలపై రూ.52 కోట్లు జరిమానా విధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 3 మున్సిపాలిటీల్లో అమృత్-2 కింద నీటి ట్యాంకుల అభివృద్ధికి రూ.96.45 కోట్లు విడుదలయ్యాయన్నారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ శాఖ ద్వారా పనులకు టెండర్లు పిలువగా, టెండర్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని సూచించారు.


