News February 28, 2025
విశాఖలో ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి

బైక్‌పై ప్రయాణించేవారికి హెల్మెట్ ధారణ తప్పనిసరి అని విశాఖ ఉప రవాణా కమీషనర్ ఆర్‌సిహెచ్ శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బైక్ నడిపే వ్యక్తి, వెనుక కూర్చున్న వ్యక్తి ఇద్దరూ హెల్మెట్ ధరించాలన్నారు. ఏ ఒక్కరు హెల్మెట్ ధరించకపోయినా జరిమానా విధిస్తామన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్సు 3 నెలలు సస్పెండ్ చేసి, ఫైన్ వేస్తామన్నారు.
Similar News
News March 21, 2025
విశాఖ మేయర్ పీఠం కదలనుందా?

విశాఖ మహా నగర మేయర్ హరివెంకటకుమారిపై ఆవిశ్వాసం తప్పేలా లేదు. ఈ క్రమంలో కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కూటమి బలం ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి70కి చేరుకుంది. మరికొన్ని రోజులలో TDP, జనసేనలో కార్పొరేటర్లు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. TDP ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాస్ కలెక్టర్ &జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేదేంద్రప్రసాద్‌ని కలిసి అవిశ్వాస తీర్మాన లేఖ ఇవ్వనున్నట్టు సమాచారం.
News March 21, 2025
ఓవర్ హీట్: విశాఖ జూలో ఉపసమన చర్యలు

వేసవి ఉష్ణోగ్రతలు మండుతున్న నేపథ్యంలో జూలో వన్యప్రాణులు ఎండ వేడిమి తిట్టించుకునేందుకు జూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చింపాంజీలు, టైగర్స్, లయన్, జీబ్రా, జిరాఫీలు, ఎలిఫెంట్స్, వివిధ రకాల పక్షులు మొదలైన వాటికి ఎండవేడిమి తట్టుకునేలా, వాటర్ స్ప్రింకలర్స్ ఏర్పాటు చేశారు. లోపల ఫ్యాన్లు, ఎయిర్ కండిషన్లు, కస్ కస్ మ్యాట్లు, తాటాకు పందిర్లు పెట్టారు. వేడి నుంచి ఉపశమనం కలిగేందుకు ఇవి దోహదపడుతున్నాయి.
News March 21, 2025
విశాఖ – భద్రాచలం ప్రత్యేక బస్సులు

శ్రీరామ నవమి సందర్భంగా విశాఖపట్నం నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని APSRTC జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 6 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయని ఆయన తెలిపారు. భక్తుల కోరిక మేరకు ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్ నుంచి రాజమండ్రి మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు.