News August 11, 2024

విశాఖలో ఓటు హక్కుకు ఎమ్మెల్సీలు దరఖాస్తు

image

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తమ పేర్లు చేర్చాలని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభా రవిబాబు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు ఉన్నారు. జీవీఎంసీ అధికారులు వీరి దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. వీరి ముగ్గురికి ఓటు హక్కు కల్పిస్తే ఎమ్మెల్సీ ఓటర్ల సంఖ్య 841కి చేరుతుంది.

Similar News

News December 7, 2025

విశాఖ: ప్రభుత్వ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

image

విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. GVMC ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్‌ కార్యలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విశాఖ: రోడ్డు ప్రమాదంలో స్టీల్ ప్లాంట్ కార్మికుడి మృతి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో చిన్నారావు తన బైక్‌పై ఇంటికి వెళుతుండగా వడ్లపూడి బ్రిడ్జిపై ఓ వాహనం ఢీంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలిని పరిశీలించిన దువ్వాడ పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.