News April 11, 2024
విశాఖలో గెలుపును నిర్ణయించేది వీరే..!

విశాఖ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని గాజువాక మినహా విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, భీమిలి, ఎస్.కోట నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో పురుష ఓటర్లు ఎక్కవగా ఉంటే.. 2024 నాటికి మహిళా ఓటర్లు వారిని అధికమించారు. లోక్ సభ పరిధిలో ఇప్పటి వరకు 19,03,175 మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుషులు 9,36,667, మహిళలు 9,66,389, ఇతరులు 119 మంది ఉన్నారు.
Similar News
News January 23, 2026
మురికివాడల రహిత నగరంగా విశాఖ

మురికివాడల రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు GVMC ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మురికివాడలు ఎక్కడుంటే అక్కడే ఇళ్లు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఎన్ని ఇళ్లు నిర్మించాలన్నది సర్వే చేసి DPR తయారుచేయనున్నారు. ఇప్పటికే దీనిపై మంత్రి నారాయణ, కమిషనర్ కేతన్ గార్గ్ మురికివాడలను సందర్శించారు. నగరంలో దాదాపు వందకు పైగా మురికివాడలు ఉన్నాయి. దశల వారీగా వీటిని అభివృద్ధి చేయనున్నారు.
News January 23, 2026
GVMC కౌన్సిల్ సమావేశం.. 15 అంశాల ఎజెండా

ఈనెల 30న జరిగే GVMC కౌన్సిల్ సమావేశంలో 15 అంశాలతో ఎజెండాను తయారు చేశారు. మేయర్ పిలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే సమావేశం ఉ.11 గంటలకు ప్రారంభం కానుంది. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి గీతం యూనివర్సిటీ బదలాయింపు, క్రమబద్దికరించే అంశాన్ని ఎజెండాలో పొందుపరిచారు. GVMC ఉద్యోగుల సర్వీస్ అంశం, సింహాచలం తొలిపంచ జంక్షన్ వద్ద జంక్షన్ వద్ద రూ1.25 కోట్ల అభివృద్ధి పనులు వీటిలో కలవు.
News January 23, 2026
మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి విశాఖ పర్యటన

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయస్వామి ఈనెల 24, 25వ తేదీల్లో విశాఖలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.
శనివారం ఉదయం విశాఖ చేరుకుని దస్పల్లా హోటల్లో బస చేస్తారు. సాయంత్రం ఆర్‌కే బీచ్ వద్ద నిర్వహించే విశాఖ ఉత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం నగర పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం విశాఖ నుంచి ప్రకాశం జిల్లాకు తిరుగుపయనమవుతారు.


