News April 11, 2024
విశాఖలో జనావాసాల్లోకి వణ్యప్రాణులు

ఎండ తీవ్రతకు వన్యప్రాణులు జనావాసాల్లోకి వణ్యప్రాణులు వచ్చేస్తున్నాయి. విశాఖలోని కొండవాలు ప్రాంతాల్లో తరచూ ఈ ఘటనలు కనిపిస్తున్నాయి. విశాలాక్షి నగర్‌లో నిన్న ఓ కొమ్ముల దుప్పి రోడ్లపై సంచరించింది. వీటితో ప్రమాదం లేనప్పటికీ.. అధికారులు తగల చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News March 22, 2025
అనకాపల్లిలో రెండు లారీలు ఢీ.. ఒకరి మృతి

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కశింకోట మండలం నేషనల్ హైవేపై ఎన్‌జీ పాలెం వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకున్నాడు. అతికష్టం మీద అతడిని బయటకు తీశారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 22, 2025
విశాఖలో దొంగలు దొరికారు..!

కేబుల్ వైర్ల దొంగలు విశాఖ పోలీసులకు చిక్కారు. విశాఖ R&Bఆఫీసు సమీపంలోని ఏకలవ్య కాలనీకి చెందిన పిట్టోడు, ఏలూరుకు చెందిన శ్రీను గతంలో కేబుల్ వైర్ పనులు చేశారు. ఎంతో విలువైన ఆవైర్లను కొట్టేయడానికి ప్లాన్ వేశారు. BSNLల్యాండ్ లైన్ ఫోన్లు పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోరనుకున్నారు. MVP డబుల్ రోడ్డులో రాత్రి వేళ గుంతలు తవ్వి టెలిఫోన్ వైర్లను దొంగలించారు. పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.
News March 22, 2025
విశాఖ రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

విశాఖలోని 13 రైతు బజార్లలో శనివారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.15, ఉల్లి రూ.23/28, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ.38, మిర్చి రూ.28, బెండ రూ.38, బీరకాయలు రూ.44, క్యారెట్ రూ.22/34, బీట్రూట్ రూ.18, బీన్స్ రూ.48, గ్రీన్ పీస్ రూ.50, వంకాయలు రూ.30, కీర రూ.22, గోరు చిక్కుడు రూ.34, బరబాటి రూ.24, కాలీఫ్లవర్ రూ.20, అనప రూ.24గా నిర్ణయించారు.