News December 1, 2025
విశాఖలో జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలకు రంగం సిద్ధం

విశాఖపట్నం వేదికగా డిసెంబర్ 5 నుంచి 15 వరకు 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదివారం పోటీలు జరిగే వుడా పార్క్, శివాజీ పార్క్, కైలాసగిరి, బోయపాలెం వేదికలను పరిశీలించారు. అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. స్పీడ్, హాకీ, ఆల్ఫైన్ తదితర విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 10, 2026
భారీ టార్గెట్‌ను ఊదేశారు

T20WC: UAEపై న్యూజిలాండ్ జట్టు ఘన విజయం నమోదు చేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు టిమ్(89), ఫిన్ అలెన్(84) బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సులతో చెలరేగారు. 4.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను ముగించేశారు. యూఏఈ బౌలర్లు ఎవరూ కివీస్ బ్యాటర్లపై ప్రభావం చూపలేకపోయారు. రొహిద్ ఖాన్, జునైద్‌లు 40+ పరుగులు సమర్పించుకున్నారు.
News February 10, 2026
MLA, MLCలకు క్రీడలు: అయ్యన్న

AP: MLA, MLCలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఇవి జరుగుతాయన్నారు. క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, కబడ్డీ, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, చెస్ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోటీలు జరుగుతాయని వెల్లడించారు. క్రీడలన్నీ అసెంబ్లీ ప్రాంగణంలోనే జరగనున్నాయని తెలిపారు.
News February 10, 2026
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించాలి: కలెక్టర్

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఈనెల 17న జిల్లా వ్యాప్తంగా జయప్రదంగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో గోడ పత్రాలను విడుదల చేశారు. 3–18 ఏళ్లలోపు 3,29,850 మంది చిన్నారులకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భోజనం అనంతరం మాత్రలు నమిలి మింగేలా అవగాహన కల్పించాలని, పోషణ లోపం, రక్తహీనత నివారణపై దృష్టి సారించారు.


