News February 15, 2025

విశాఖలో జీబీఎస్ కలకలం.. ఐదు కేసులు నమోదు

image

విశాఖలో గులియన్ బారే సిండ్రోం (జీబీఎస్) కేసులు నమోదు కావడం కలకలం రేపింది. గడచిన నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు ఈ సమస్యతో కేజీహెచ్‌లో చేరారు. ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగంలోని ఎక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లో వీరు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే పూర్తిగా కోలుకునేవరకు తమ పర్యవేక్షణలో సేవలు అందిస్తున్నట్లు కేజీహెచ్ వైద్యులు తెలిపారు.

Similar News

News March 28, 2025

ఏప్రిల్ 1న పదో తరగతి సోషల్ పరీక్ష: విశాఖ డీఈవో

image

రంజాన్ మార్చి 31న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఈవో ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అయితే పదో తరగతి సోషల్ పరీక్ష మార్చి 31వ తేదీన నిర్వహించనున్నట్లు ముందు హల్ టికెట్స్‌లో ప్రచురితం చేశారని, రంజాన్ పండుగ కావడంతో ఏప్రిల్ 1న పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.

News March 28, 2025

విశాఖ: ‘పోటెన్షియల్ లింక్‌డ్ క్రెడిట్ ప్లాన్’ విడుద‌ల‌

image

విశాఖ జిల్లా అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని రూ.23,870.62 కోట్లతో క్రెడిట్ ప్లాన్ రూపొందించినట్లు నాబార్డ్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ‌ర్ బ‌సంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో నాబార్డ్ 2025-26 ‘పోటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్’ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విడుద‌ల చేశారు. ఈ ప్రణాళిక ముఖ్యంగా MSMEలు, పునరుత్పాదక ఇంధనం, ఎగుమతి క్రెడిట్ సుస్థిర వ్యవసాయంపై దృష్టి సారించింద‌ని పేర్కొన్నారు.

News March 28, 2025

గాజువాకలో బాలికతో పాటు మరో వ్యక్తి ఆత్మహత్య

image

గాజువాక వడ్లపూడి అప్పికొండ కాలనీలోని ఓ ఇంట్లో బాలికతో పాటు మరో వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. దువ్వాడ పోలీసుల వివరాల ప్రకారం.. మర్రిపాలెంకి చెందిన అమీరుద్దిన్ ఖాన్(36) సింహాచలంలో బాలిక(17) తల్లి నిర్వహిస్తున్న హోటల్లో పని చేసేవాడు. అతని వైఖరి నచ్చగా బాలిక తల్లి పని నుంచి తొలగించింది. కాగా శుక్రవారం అమీరుద్దీన్ రూమ్‌‌లో బాలిక, అమీరుద్దిన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

error: Content is protected !!