News March 5, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ విశాఖలో ఎన్నికల కోడ్ ఎత్తివేత: కలెక్టర్
➤ దివ్యాంగుల పారా స్టేడియం కోసం స్థల పరిశీలన
➤ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు స్టేడియం సిద్ధం
➤ మార్చి 17 నుంచి 134 కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు
➤ నేడు విద్యుత్ ప్రధాన కార్యాలయంలో లైన్‌మ్యాన్ దివస్
➤ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా చర్యలు
Similar News
News December 8, 2025
విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో పై అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారని 1062 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు.
News December 8, 2025
MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్లో కూరగాయలు

MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్లో కూరగాయలు లభ్యమవుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో అమలు చేస్తున్న అధికారులు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. రైతు బజార్ ధరలకే డోర్ డెలివరీ చేస్తున్నారు. మాచింట్ సొల్యూషన్స్ అనే సంస్థ https://digirythubazaarap.com వెబ్సైట్ ద్వారా 5 రోజులుగా 150 మందికి డెలివరీ చేసింది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చార్జీలు లేవు.
News December 8, 2025
విశాఖ కలెక్టరేట్ నేడు PGRS కార్యక్రమం

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


