News November 19, 2025

విశాఖలో నాకు తెలియని వీధి లేదు: బాలకృష్ణ

image

లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అప్పన్నను దర్శించుకోవడం దైవ నిర్ణయం అని బాలకృష్ణ అన్నారు. అఖండ-2 సాంగ్ రిలీజ్ నేపథ్యంలో విశాఖతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో తనకు తెలియని వీధి అంటూ లేదని, ప్రతి వీధిలో షూటింగ్ చేశానని అన్నారు. లెజెండ్ షూటింగ్ సందర్భంగా ఆర్కేబీచ్‌లో అద్దాన్ని పగలగొట్టుకుంటూ గుర్రంపై వెళ్లానని గర్తు చేసుకున్నారు.

Similar News

News January 23, 2026

పాలమూరు: భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య.!

image

మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో అనుమానం ప్రాణం తీసింది. భార్య లలితకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో శివకుమార్ (35) మనస్తాపానికి గురై శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకున్నాడు. వీరికి 8 ఏళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరి మధ్య తరచూ జరుగుతున్న గొడవలపై గతంలో పంచాయితీలు జరిగినా ఫలితం లేకపోయింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ విక్రమ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News January 23, 2026

అనంతపురం ఎమ్మెల్యే అనుచరుడు గంగారాం అరెస్ట్?

image

అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరుడు గంగారాంను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడి, నంబూరి వైన్స్‌కు నిప్పు పెట్టిన ఘటనల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. కొన్నిరోజులు పరారీలో ఉన్న ఆయనను అనంతపురం పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

News January 23, 2026

పిఠాపురానికి జనసేనాని.. 3 రోజుల పాటు..

image

పిఠాపురం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ఆయన తన నియోజకవర్గంలోనే పర్యటించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సమస్యల పరిష్కారానికి ‘జనవాణి’ నిర్వహించడంతో పాటు, మంజూరైన నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా తనిఖీ చేయనున్నట్లు సమాచారం. పవన్ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.