News December 3, 2025
విశాఖలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సీపీ శంఖబ్రత బాగ్చితో కలసి రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. హైవేలో జీబ్రా క్రాసింగ్ వద్ద సోలార్ బ్యాంకర్లు ఏర్పాటు చేయాలన్నారు .మేజర్ రోడ్లలో, పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు చేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను వెంటనే వినియోగంలోకి తేవాలన్నారు.
Similar News
News February 10, 2026
విలీన గ్రామాల ప్రక్రియ ఆలస్యం.. GVMC ఎన్నికలపై అనిశ్చితి

GVMCలో 64 పంచాయతీల విలీన ప్రతిపాదనపై పంచాయతీరాజ్ శాఖ దగ్గర ప్రక్రియ ముందుకు సాగడం లేదు. విలీనానికి ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాల పరిశీలన, వార్డుల విభజన, ఓటర్ల జాబితా వంటి దశలు పూర్తికావాలి. మార్చి 17తో పాలక మండలి గడువు ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌పై అనిశ్చితి నెలకొంది. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనవరి 1 అర్హత ఆధారంగా వార్డుల వారిగా ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయాలని ఆదేశించింది.
News February 10, 2026
కేంద్ర రైల్వేశాఖ మంత్రితో ఎంపీ శ్రీ భరత్ భేటీ

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను విశాఖ ఎంపీ శ్రీ భరత్ మంగళవారం పార్లమెంట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ రైల్వే జోన్ కోసం చర్చించారు. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, చెన్నై, విజయవాడ వంటి అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో రైళ్ల కొరత ఉందని తెలియజేస్తూ, ఆయా మార్గాల్లో కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని కోరారు. విశాఖ మీదుగా ప్రయాణించే రైళ్లకు అత్యవసర కోటాను పెంచాలన్నారు.
News February 10, 2026
విశాఖ సీపీని కలిసిన సింహాచలం ఈవో

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చిని, జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్‌ను సింహాచలం ఈవో వెంకటరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రానున్న చందనోత్సవ వేడుకలపై వీరు చర్చించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈవోకు జీవీఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్ సూచించారు.


