News August 20, 2025

విశాఖలో షీ టీమ్స్ విస్తృత తనిఖీలు

image

విశాఖలో షీ టీమ్స్ ద్వారా ‘ఈట్ రైట్ క్యాంపైన్’ కింద అన్ని జోన్లలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, వీధి ఆహార విక్రేతల వద్ద విస్తృత తనిఖీలు జరుపుతున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం తెలిపారు. ఇప్పటివరకు 76 చోట్ల తనిఖీలు చేసి, 71 చోట్ల నోటీసులు, 50 చోట్ల రూ.68,600 అపరాధ రుసుములు విధించామని వెల్లడించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News January 19, 2026

వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే మెమోలు: కలెక్టర్

image

విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. అంతకుముందు అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలన్నారు. జీవీఎంసీలో సాధారణ, టౌన్ ప్లానింగ్ వినతులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్‌కి ఆదేశించారు. అలసత్వం వహిస్తే 2 సార్లు మెమోలు ఇవ్వాలని, మూడోసారి ఛార్జి మెమో ఇవ్వాలన్నారు.

News January 19, 2026

విశాఖ: ఫిర్యాదులు చేసేందుకు ఎవరూ రాలేదు!

image

ప్రతి సోమవారం జీవీఎంసీలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ 10 గంటలకు ప్రారంభమైనా ఫిర్యాదుదారులు కనిపించలేదు. మరోవైపు అధికారులు కూడా సగానికి పైగా లేకపోవడం విశేషం. అన్ని సీట్లు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో వచ్చిన వారు విస్తుపోతున్నారు. పండగ ఎఫెక్ట్ కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని పలువురు భావిస్తున్నారు.

News January 19, 2026

గాజువాకలో పండుగ దెబ్బ.. రెచ్చిపోయిన దొంగలు

image

గాజువాకలోని దొంగలు పండుగ దెబ్బ చూపించారు. 70వ వార్డు ఎల్బీనగర్‌లో ఒకే వరుసులో ఉన్న మూడు ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాజువాక క్రైమ్ సీఐ, ఇతర బృందం చేరుకుని వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఈ మూడు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ఏం చోరీ జరిగిందనే విషయం తెలియరాలేదు. యజమానులకు పోలీసులు సమాచారం అందించారు. సీసీ పుటేజులు పరిశీలిస్తున్నారు.