News October 5, 2025

విశాఖలో స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటయ్యే ప్రాంతాలివే(1/2)

image

మల్కాపురం గాంధీనగర్‌ మార్కెట్‌లో 100, 104 ఏరియాలో 60, ఊర్వశి జంక్షన్‌ నుంచి కంచరపాలెం మెట్టు రోడ్డులో 14, జింక్‌ గేటు జంక్షన్‌ వద్ద 29, దువ్వాడ ఫ్లైఓవర్‌ కింద 24, ఎన్‌ఏడీ జంక్షన్‌లో 10, బాజి జంక్షన్‌లో 5, గోశాల జంక్షన్‌లో 10, అడవివరం జంక్షన్‌లో 10, వేపగుంట జంక్షన్‌లో 15, పెందుర్తిలో 30, నరసింహనగర్‌లో 14 <<17922709>>దుకాణాలు ఏర్పాటు<<>> చేయనున్నారు.

Similar News

News January 24, 2026

విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్

image

విశాఖ-టాటానగర్-విశాఖ (20816/15) వీక్లీ ఎక్స్‌ప్రెస్ టెర్మినల్ స్టేషన్‌ను టాటానగర్ నుంచి ఆదిత్యపూర్‌కు మారుస్తూ వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ మార్పు మార్చి 29 నుంచి అమలులోకి వస్తుంది. రైలు సమయాల్లో కూడా స్వల్ప మార్పులు జరిగాయి. ఆదిత్యపూర్ నుంచి ఉదయం 7.30 గంటలకు రైలు బయలుదేరుతుంది. ప్రయాణికులు పూర్తి వివరాల కోసం 139 నంబర్‌ను సంప్రదించవచ్చు.

News January 24, 2026

విశాఖలో 392 మందికి నియామక పత్రాల అందజేత

image

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజ్‌గార్‌ మేళా ప్రవేశపెట్టిందని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఈ మేళా దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించిందన్నారు. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం జరిగిన రోజ్‌గార్‌ మేళాలో మంత్రి పాల్గొని 392 మందికి నియామక పత్రాలు అందజేశారు.

News January 24, 2026

​ఈస్ట్ కోస్ట్ రైల్వే సరికొత్త రికార్డు.. రూ.23 వేల కోట్ల ఆదాయం

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.23,000 కోట్ల సరుకు రవాణా ఆదాయాన్ని కేవలం 294 రోజుల్లోనే సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 27 రోజులు ముందే కావడం విశేషం. మొత్తం ఆదాయంలో 11.21%, సరుకు రవాణాలో 11.31% వృద్ధిని నమోదు చేస్తూ, భారతీయ రైల్వేలోనే నంబర్ వన్ జోన్‌గా నిలిచింది. ఈ వివరాలను ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారికంగా వెల్లడించింది.