News March 8, 2025
విశాఖ: అప్పు ఇచ్చిన వారి ఇంటిలోనే ఆత్మహత్య

అప్పు ఇచ్చిన వారి ఇంటిలోనే చచ్చిపోతున్నా.. అంటూ ఓ మహిళ వాయిస్ మెసేజ్ కలకలం సృష్టించింది. కొబ్బరి తోటకు చెందిన ధనలక్ష్మి వద్ద సుగుణ అప్పు తీసుకుంది. వీరిద్దరి మధ్య వివాదం జరగ్గా ధనలక్ష్మి, ఆమె కుమారుడు సుగుణతో గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన సుగుణ.. గురువారం ధనలక్ష్మి ఇంటికి వెళ్లి రూమ్‌లో తలుపు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సుగుణ బంధువులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు.
Similar News
News January 22, 2026
30న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం

విశాఖ నగరపాలక సంస్థకు ఈ నెల 30న సాధారణ కౌన్సిల్ సమావేశం, ఫిబ్రవరి 4న 2026–27 వార్షిక బడ్జెట్‌కు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు మేయర్ పీలా శ్రీనివాసరావు గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్‌కు ప్రతిపాదనలు పంపారు. రూ.50 లక్షల పనుల అనుమతులపై ఈ నెల 27న స్థాయి సంఘం సమావేశం జరగనుంది. పాలకవర్గ పదవీకాలం మార్చి 18తో ముగియనుండగా, మార్చి 7 తర్వాత కౌన్సిల్ సమావేశాలకు నిబంధనల ప్రకారం అవకాశం లేదు.
News January 22, 2026
విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం

విశాఖపట్నంలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఇమ్మిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కానుంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు విశాఖలోనే అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్, చెన్నైపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. హోం మంత్రిత్వ శాఖ విశాఖ నగరంలోని మారిక వల్ల సమీపంలోని ఓజోన్ వ్యాలీ లేఔట్‌లో ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టింది.
News January 22, 2026
విశాఖ: కాంబోడియాకు యువతను తరలిస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

కాంబోడియాకు యువతను విశాఖ నుంచి తరలిస్తున్న ప్రధాన ఏజెంటు బొంగు మురళిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానికంగా భావన ఫ్యాబ్రికేటర్స్ వర్క్ ఏర్పాటు చేసి ఉపాధి పేరుతో యువకులను కాంబోడియా తరలిస్తుండగా గతంలో అరెస్టు చేశారు. మరోసారి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయనపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు తెలిపారు.


