News January 22, 2025

విశాఖ: ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం రూ.2 కోట్లు

image

సంక్రాంతి సీజన్‌లో విశాఖ ఆర్టీసీకి రూ. రెండు కోట్ల ఆదాయం వచ్చినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35% అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. సంక్రాంతికి ముందు తర్వాత ఈనెల 21 వరకు విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాలకు బస్సులు నడిపినట్లు తెలిపారు. ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయలేదన్నారు.

Similar News

News February 11, 2025

గాజువాకలో గంజాయి స్వాధీనం

image

కణితి రోడ్డులోని ఓ ఇంట్లో గంజాయి ఉన్నట్లు సమాచారం అందడంతో గాజువాక పోలీసులు మంగళవారం తనిఖీలు చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ తనిఖీలలో 184 కేజీల గంజాయి, ఒక కారు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇమ్రాన్ ఖాన్, అర్జున్ కుమార్, కోరాడ బాలాజీ కృష్ణ, బిదేశి కుమార్ సాహు, దామా ఖరా, శుక్రమతం, రామచంద్ర సిషా, మనోజ్ ఖేముండు ఉన్నట్లు తెలిపారు.

News February 11, 2025

విశాఖ: ఉపాధ్యాయ MLC.. అందరూ అర్హులే

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోటీ చేసేందుకు నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థులంద‌రి నామ ప‌త్రాలు ఆమోదం పొందాయి. ఎన్నిక‌ల అబ్జెర్వ‌ర్ నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో విశాఖ క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో ప‌రిశీల‌న ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించారు. ప్ర‌మాణాల‌కు అనుగుణంగా అంద‌రి ప‌త్రాలు ఉండ‌టంతో 10 మంది అభ్య‌ర్థుల తాలూక‌ నామినేష‌న్ల‌ను ఆమోదించినట్లు రిట‌ర్నింగ్ అధికారి తెలిపారు.

News February 11, 2025

UPDATE: రీల్స్ పేరుతో పెళ్లి.. యువకుడిపై పోక్సో

image

ఓ బాలిక ఇన్‌స్టా‌గ్రామ్‌లో చేసిన రీల్‌కు లైక్ కొట్టి ట్రాప్ చేసిన యువకుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాటిచెట్లపాలెంకి చెందిన భార్గవ్ ఓ బాలిక రీల్‌కు లైక్ కొట్టి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరై పెళ్లి చేసుకోగా విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. వారి ఫిర్యాదు మేరకు భార్గవ్‌పై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి సోమవారం రిమాండ్ విధించారు.

error: Content is protected !!