News March 9, 2025
విశాఖ: ఇన్‌ఛార్జ్ మంత్రితో సమావేశమైన జిల్లా కలెక్టర్, సీపీ

విశాఖలో శనివారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని పోర్ట్ గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విశాఖ సీపీ శంఖ బ్రాత బాగ్చి కలిశారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు గూర్చి మంత్రి అడిగి తెలుసుకున్నారు. P4 సర్వే సమర్థవంతంగా జరిగేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News March 27, 2025
ప్రారంభానికి సిద్ధంగా “VMRDA THE DECK”

సిరిపురం నిర్మాణంలో ఉన్న నూతన “VMRDA THE DECK” త్వరలో ఓపెన్ కాబోతుంది. ఇందులో 5 అంతస్తుల్లో పార్కింగ్ సదుపాయం, 6 అంతస్తుల్లో కమర్షియల్‌కి సదుపాయం కల్పించబోతున్నారు. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.87.50 కోట్లు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. అతి త్వరలో దీనిని ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రారంభమయ్యాక పార్కింగ్ సమస్యలు తీరనున్నాయి. ఇందులో 4వీలర్, 2వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు.
News March 27, 2025
విశాఖ ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం

విశాఖలో ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న అమాయక చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కీచకుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని హోంమంత్రి ఆదేశించారు. నిందితుడుని గుర్తించి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హోం మంత్రికి సీపీ తెలిపారు.
News March 27, 2025
విశాఖలో లులూ మాల్‌కు భూమి కేటాయింపు

విశాఖలో లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఐఐసీ ద్వారా భూకేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీచ్ రోడ్‌లోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. లులూ గ్రూప్ విశాఖలో పెట్టుబడులకు ఎస్ఐపీబీలో ఆమోదించినట్టు పరిశ్రమల శాఖ తెలిపింది.