News November 19, 2025
విశాఖ కమిషనరేట్‌లో వెయిటింగ్ హాల్ ప్రారంభం

విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి కమిషనరేట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సందర్శకుల వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించారు. కమిషనర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు హాల్ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు తదితర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 24, 2026
విశాఖలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ తాత్కాలిక మార్పు

విశాఖ రైల్వే రిజర్వేషన్ కార్యాలయాన్ని ఈనెల 26 మధ్యాహ్నం నుండి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. దీనిని సాధారణ టికెట్ బుకింగ్ కార్యాలయం (General Booking) వద్దకు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీ నుండి రిజర్వేషన్ సేవలు అక్కడే అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.
News January 24, 2026
విశాఖ రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కార్యాలయం మార్పు

విశాఖ రైల్వే స్టేషన్ వద్ద రిజర్వేషన్ కౌంటర్‌ను మార్చుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జనవరి 26 నుంచి ప్రస్తుత రిజర్వేషన్ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు చెప్పారు. జనవరి 27 నుంచి విశాఖ రైల్వే స్టేషన్ గేట్ నంబర్-2, నంబర్-3 మధ్యగల భవనంలో రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
News January 24, 2026
విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు

రిపబ్లిక్ డే రద్దీ దృష్ట్యా విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. 08517 రైలు జనవరి 25న సాయంత్రం5.30కి విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15కి చర్లపల్లి చేరుతుంది. తిరుగుపయనంలో 08518 రైలు జనవరి 26న మధ్యాహ్నం 3.30కి చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ వస్తుంది. ఈ రైళ్లు దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా ప్రయాణిస్తాయి.


