News August 20, 2025
విశాఖ: కానిస్టేబుల్‌గా ఎంపికైన వారికి అలెర్ట్

సివిల్, ఏపీఎస్సీ ఉద్యోగాలకు విశాఖలో ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు ఈనెల 22వ తేదీన కైలాసగిరి ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో హాజరుకావాలని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలు, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన మూడు సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకురావాలన్నారు. అలాగే మూడు కలర్ ఫొటోలతో ఉదయం ఏడు గంటలకు హాజరు కావాలన్నారు. >Share it
Similar News
News January 17, 2026
పాస్ పుస్తకంతో సులభంగా భూమి వివరాలు: జేసీ

రైతులు తమ భూమికి సంబంధించిన వివరాలను పాసు పుస్తకాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆచంట మండలం పెనుమంచిలి గ్రామ సచివాలయం వద్ద జరిగిన గ్రామ సభలో జేసీ పాల్గొన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలను పరిశీలించారు. గ్రామ సభకు హాజరైన రైతులతో ఆయన మాట్లాడారు. రైతుల సందేహాలను నివృత్తి చేసి, పలు సూచనలు చేశారు.
News January 17, 2026
PHOTOS: HYDలో అబ్బురపరిచే హాట్ ఎయిర్ బెలూన్ షో

TG: హైదరాబాద్‌లో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 18 బెలూన్స్ గాల్లో సందడి చేస్తున్నాయి. గోల్కొండ వద్ద ఆకాశం నుంచి తీసిన ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. అటు ఇవాళ ఉదయం ఓ బెలూన్ సాంకేతిక సమస్యతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందన్న వార్తలను నిర్వాహకులు ఖండించారు. అందులో వాస్తవం లేదన్నారు.
News January 17, 2026
రాహుల్‌ను అవమానించానని ఫీలవుతున్నా: జగ్గారెడ్డి

TG: సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయనని PCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ‘గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సంగారెడ్డి వచ్చి నన్ను గెలిపించాలని కోరితే ఇక్కడివారు ఓడించారు. ఆయన్ను సంగారెడ్డికి పిలిచి అవమానించానేమోనని ఫీలవుతున్నాను. నా ఓటమికి కారణం పేదలు కాదు మేధావులు, పెద్దలే. అందుకే ఇకపై ఇక్కడ పోటీచేయదల్చుకోలేదు. నా భార్య ఇక్కడ పోటీ చేసినా ప్రచారం చేయను’ అని పార్టీ భేటీలో స్పష్టం చేశారు.


