News March 27, 2024
విశాఖ: కారుతో యువతి బీభత్సం..!

విశాఖలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో కారుతో ఓ యువతి బీభత్సం సృష్టించింది. మితిమీరన వేగంతో కారు నడిపి మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా.. స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. డ్రైవింగ్ చేస్తున్న యువతి బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థినిగా గుర్తించారు. కారులో ఎయిర్ బాగ్స్ ఓపెన్ కావడంతో యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. కారు నడిపిన సమయంలో యువతి మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు.
Similar News
News February 13, 2026
విశాఖ: రేపు పాఠశాలల సెలవు రద్దు

జిల్లాలో ఫిబ్రవరి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తూ డీఈవో ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నెలకొన్న ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో ఒక రోజు సెలవు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.
News February 13, 2026
గంగవరం పోర్టులో కనీసం బ్రేక్ వాటర్ నిర్మించండి: ఎమ్మెల్యే పల్లా

గంగవరం పోర్టు ఏర్పడిన తర్వాత ఇక్కడ జెట్టీ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జెట్టీ లేక ఇక్కడి మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించారు. కనీసం బ్రేక్ వాటర్‌ను అయినా నిర్మించి స్థానిక మత్స్యకారులను ఆదుకోవాలని ఆయన కోరారు.
News February 13, 2026
విశాఖ: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

విశాఖ జిల్లాలోని ఎంజేపీ ఏపీ బీసీ గురుకులాల్లో 5వ తరగతి, 6-8 (బ్యాక్‌లాగ్), ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 12న 5వ తరగతికి, ఏప్రిల్ 19న మిగిలిన తరగతులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని గురుకులం ప్రిన్సిపల్ గుణుపూరు పురుషోధి తెలిపారు. మరిన్ని వివరాలకు www.mjpapbcwreis.pacfss.inను సందర్శించాలన్నారు.


