News April 10, 2024
విశాఖ జిల్లాలో నాలుగు ప్రభుత్వ పెట్రోల్ బంకులు

విశాఖ రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నాలుగు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ మల్లిఖార్జున నిర్ణయం తీసుకున్నారు. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగులు సంక్షేమం కోసం ఖర్చు చేయనున్నారు. మూడు మండలాల పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటుకు స్థలాలను కూడా కేటాయించారు. గాజువాక మండలం చినగంట్యాడ, అగనంపూడి, ఆనందపురం మండలం కుసులవాడ, సీతమ్మధార మండల పరిధిలో రేసపువానిపాలెంలో స్థలాలు కేటాయించారు.
Similar News
News December 11, 2025
జీవీఎంసీలో గ్రామాల విలీనం సరికాదు: బొలిశెట్టి సత్యనారాయణ

గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేయడం సరైంది కాదని జనసేన నాయకుడు బోలిశేట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం ప్రజల రాజ్యాంగ బద్ధమైన హక్కుఅని, ప్రజల అభిప్రాయం లేకుండా గ్రామాలను కార్పొరేషన్‌లో కలపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. ప్రజల భవిష్యత్తు కొంతమంది రాజకీయనాయకుల ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడం కుదరదన్నారు.
News December 11, 2025
టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం: విశాఖ డీఈవో

విశాఖ జిల్లాలో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ వంటి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సుల (లోయర్, హయ్యర్) పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. అభ్యర్థులు www.bse.ap.gov.in ద్వారా అప్లై చేసుకోవాలన్నారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 27వ తేదీ వరకు గడువు ఉంది. ఆలస్య రుసుముతో జనవరి 6వ తేదీ వరకు అవకాశముంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రతులను DEO కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
News December 11, 2025
పంచాయతీ రాజ్ వ్యవస్థలదే కీలక పాత్ర: జీవీఎంసీ కమిషనర్

దేశ జనాభాలో 70 శాతం మందికి సేవలందిస్తున్న పంచాయతీ రాజ్ వ్యవస్థల పాత్ర కీలకమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ఐఐఎం విశాఖలో పంచాయతీ రాజ్ అధికారుల కోసం నిర్వహించిన నాయకత్వ శిక్షణ ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. అధికారుల నైపుణ్యాలను పెంచేలా ఐఐఎం రూపొందించిన శిక్షణా విధానాన్ని ప్రశంసించారు. 2026 మార్చి నాటికి 500 మంది అధికారులకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.


