News August 14, 2025
విశాఖ జిల్లాలో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 165.2 మి.మీల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా పద్మనాభం మండలంలో 51.4mm, అత్యల్పంగా ములగడలో 5.6mm వర్షపాతం నమోదయింది. పెందుర్తిలో 18.2, భీమునిపట్నంలో 14.2 మి.మీ వర్షపాతం కురిసింది. రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Similar News
News March 10, 2026
మధురవాడ: మహిళా దినోత్సవం వేడుకలు.. పురుషులకు వంట పోటీలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా భీమిలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మంగళవారం వాంబేకాలనీలో వినూత్నంగా పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు. 9వ రోజు కార్యక్రమంగా జరిగిన ఈ పోటీలలో స్థానిక పురుషులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల వంటకాలను తయారు చేశారు. కుటుంబ బాధ్యతల్లో పురుషుల భాగస్వామ్యం, మహిళల పట్ల గౌరవం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
News March 10, 2026
కేజీహెచ్ వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు

‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీహెచ్‌కు చెందిన ఇద్దరు వైద్యులకు ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. గైనిక్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.పి.ఉషాదేవి, అనస్థీషియా విభాగాధిపతి ప్రొఫెసర్ వాసుపల్లి రవికి 10 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. స్పందించకపోతే అందుబాటులో ఉన్న ఆధారాలతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
News March 10, 2026
విశాఖలో యువకుడి అనుమానాస్పద మృతి

విశాఖలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు టూటౌన్ ఎస్‌ఐ మన్మథరావు మంగళవారం తెలిపారు. కొబ్బరి తోట ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు బర్రె శివ ఇంట్లోనే ఉరివేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుని మెడపై గాయాలు ఉండడంతో హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


