News April 27, 2024
విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు రాజీనామా

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గొంప గోవిందరాజు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని ఆయన అధ్యక్షురాలు షర్మిలకు పంపించారు. కాంగ్రెస్ పార్టీతో ఏ సంబంధం లేని వారికి టిక్కెట్లు ఇవ్వడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేశానన్నారు. ఆయన భవిష్యత్తు నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News April 15, 2026
విశాఖను సౌర హబ్‌గా తీర్చిదిద్దుతాం: MP భరత్

విశాఖ జిల్లాను సౌర విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దుతామని MP భరత్ పేర్కొన్నారు. MVPలోని హెలెన్ కెల్లర్ పాఠశాలలో 5KV సోలార్ ప్రాజెక్టును కలెక్టర్ M.అభిషిక్త్ కిశోర్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News April 15, 2026
విశాఖలో ఒక్కరోజే 2,637 కేసులు నమోదు

విశాఖలోని ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఒక్కరోజే 2,637 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,294, పిలియన్ రైడర్-221, ట్రిపుల్ రైడింగ్- 88, ఓవర్ స్పీడ్-234, సెల్ఫోన్ డ్రైవింగ్-35, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-07, మైనర్ డ్రైవింగ్-1, రాంగ్ పార్కింగ్-183, డ్రంకన్ డ్రైవింగ్-45, సీజ్ అయిన వెహికల్స్-63 ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-588 కేసులతోపాటు, కోర్టులో 50 మందికి జరిమానా విధించారు.