News August 23, 2025

విశాఖ జిల్లా వాసి సత్తా.. ఒకేసారి మూడు పోస్టులు!

image

పద్మనాభం మండలం పొట్నూరు గ్రామానికి చెందిన ఉప్పు సంతోష్‌ను ఒకేసారి మూడు పోస్టులు వరించాయి. గత రాత్రి విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 11వ ర్యాంకు, టీజీటీ మ్యాథ్స్ 46వ ర్యాంకు, ఎస్జీటీ 272వ ర్యాంకులను ఆయన సాధించారు. ప్రస్తుతం సంతోష్ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ విజయాన్ని ఇటీవల మరణించిన తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు సంతోష్ తెలిపారు.

Similar News

News January 13, 2026

15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్

image

రామభద్రపురం మండలంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 22 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ రిసోర్సుపర్సన్ గోవింద్ కోరారు. ఉపాధిహామీ పథక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధి పనులు, సామాజిక భద్రతా పింఛన్లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సుమారు రూ.16.50 కోట్ల విలువచేసే పనులపై ఈ
సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

News January 13, 2026

పులివెందుల హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు శిక్ష

image

పులివెందుల అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండున్నర సంవత్సరాల కిందట జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ కడప అదనపు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఫిర్యాదిదారుడిపై కత్తితో దాడి చేసినట్టు నేరం రుజువుకావడంతో ఈ శిక్ష విధించారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News January 13, 2026

సంగారెడ్డి: హాజరు ఆధారంగానే జీతాలు: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది హాజరు కోసం ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం వైద్యశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. హాజరు ఆధారంగానే జీతాల చెల్లింపులు జరగాలని స్పష్టం చేశారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.