News April 25, 2025

విశాఖ జూలో వేసవి తాపానికి చెక్

image

వేసవికాలం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విశాఖ జూ పార్కులో వన్యప్రాణుల వేసవితాపం జూక్యూరేటర్ మంగమ్మ, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రకాల జంతువుల వద్ద వాటర్ స్పింక్లర్లు ఏర్పాటు చేయడం, సాదు జంతువులకు వాటర్ స్ప్రే చేయడం, కొన్ని రకాల పక్షులకు, జంతువులకు ఎయిర్ కండిషన్స్ ఏర్పాటు చేయడం వంటి సదుపాయాలు కల్పించారు.అదేవిధంగా వాటర్ మిలన్, కర్బూజా వంటి చల్లని పదార్థాలు అందజేస్తారు.

Similar News

News March 11, 2026

విశాఖలో బార్ లైసెన్సులకు ఆసక్తి చూపని వ్యాపారులు

image

విశాఖలో బార్ల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. GVMC పరిధిలో మిగిలిన 25 బార్ల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఏడాదికి రూ.95 లక్షల లైసెన్స్ ఫీజుతో పాటు దరఖాస్తుతో రూ.5 లక్షల నాన్‌రిఫండబుల్ డీడీ తప్పనిసరి కావడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మద్యం దుకాణాల పోటీ, భవన అద్దెలు, నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటంతో వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

News March 11, 2026

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ డైరెక్టర్‌గా సుబాసిస్ సేన్ గుప్తా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సుభాసిస్ సేన్ గుప్తా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన దుర్గాపూర్‌లోని సెయిల్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుత డైరెక్టర్ పురుషోత్తం పదవీ విరమణ నేపథ్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో 12 మందిలో ఆయనను ఎంపిక చేశారు. వచ్చే నెలలో సుభాసిన్ సేన్ గుప్తా బాధ్యతలు స్వీకరించనున్నారు.

News March 11, 2026

మార్చి 21నుంచి కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర

image

పెద వాల్తేరులో వేంచేసిన కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు మార్చ్ 21నుంచి ఏప్రిల్ 21వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పలు విభాగాల అధికారులతో మహారాణి పేట డిప్యూటీ తహశీల్దార్ సనపల చైతన్య ఆధ్వర్యంలో అలయ ఈఓ సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులకు భీమిలీ RDO పలు సూచనలు చేశారు. క్యూ లైన్ నిర్వహణ, శానిటేషన్, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాల పలు సూచనలు చేశారు.