News December 5, 2025
విశాఖ: ‘డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేశారు’

డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను విజయనగరం రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23న డెంకాడ వద్ద విశాఖకు చెందిన మహేష్ కుమార్ యాదవ్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోందని రూరల్ CI లక్ష్మణ రావు తెలిపారు.
Similar News
News January 19, 2026
జీవీఎంసీలో పీజీఆర్ఎస్‌కు 57 వినతులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 57 వినతులు వచ్చాయి. ఈ వినతులను కమిషనర్ కేతన్ గార్గ్ తీసుకున్నారు. ఇందులో అకౌంట్ విభాగానికి 3, రెవెన్యూ విభాగానికి 4, ప్రజారోగ్యం విభాగానికి 4, పట్టణ ప్రణాళిక విభాగానికి 30, ఇంజినీరింగు విభాగానికి 15, మొక్కల విభాగానికి ఒకటి వచ్చిందన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News January 19, 2026
విశాఖలో రెవెన్యూ క్లినిక్‌కు 63 అర్జీలు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో రెవెన్యూ క్లినిక్‌కు వచ్చిన అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై రెవెన్యూ క్లినిక్‌కు 63, సాధారణ పీజీఆర్ఎస్‌కు 109 వినతులు అందాయి. అందులో జీవీఎంసీవి 48, పోలీస్ శాఖవి 7, ఇతర శాఖలకు చెందినవి 54 ఉన్నాయి. కలెక్టర్‌తో పాటు జేసీ విద్యాధరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News January 19, 2026
విశాఖ: ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

ఇంటర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రతీ పరీక్షా కేంద్రానికి ఒక ఛీప్ సూపరింటెండెంట్, సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. 85 కేంద్రాల్లో థియరీ, 138 కేంద్రాల్లో ప్రాక్టికల్స్‌కు 81 వేల మంది హాజరుకానున్నారు.


