News November 21, 2024

విశాఖ డెయిరీ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష

image

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ డెయిరీ ఉద్యోగులు అక్కిరెడ్డిపాలెం డెయిరీ ముందు గురువారం రిలే నిరాహార దీక్షకు దిగారు. విశాఖ కో-ఆపరేటివ్ డెయిరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కేవివి మూర్తి, కార్యదర్శి ఎస్.రమణ మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.21వేలకు పెంచాలన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా బోనస్, ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. అగ్రిమెంట్ పద్ధతిపై ఉన్న ఉద్యోగులందర్నీ రెగ్యులర్ చేయాలన్నారు.

Similar News

News December 9, 2024

విశాఖ-బనారస్ ఎక్స్‌ప్రెస్ 22న రద్దు

image

విశాఖ-బనారస్ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 22వ తేదీన రద్దు చేస్తున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. సోరంటోలి చౌక్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 23న బనారస్-విశాఖ ఎక్స్‌ప్రెస్ కూడా రద్దు చేశామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News December 9, 2024

పాడేరు: తల్లిదండ్రులపై కుమారుల దాడి

image

అల్లూరి జిల్లా పాడేరులో శనివారం రాత్రి పూడి శ్రీనివాస్, వరలక్ష్మి వారి కుమార్తె వద్దకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాగానే పెద్ద కుమారుడు, కోడలు, చిన్న కుమారుడు ముగ్గురు కలిసి ఇనుప రాడ్లతో తలపై కొట్టారని, కోడలు గుండెపై తన్నిందని ఆరోపించారు. చుట్టుపక్కల వాళ్లు రాకపోతే తమను హత్య చేసేవారని ఆవేదన చెందారు. కుమార్తెకు డబ్బులు ఇస్తున్నారని ఆరోపిస్తూ దాడి చేశారని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు.

News December 8, 2024

ఎడ్యుకేషన్ హబ్‌గా ఏపీ: హోంమంత్రి అనిత

image

సీఎం చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో ఏపీ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం పట్ల ఆమె ‘X’ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రెండు స్కూల్స్ మాత్రమే మంజూరైతే కూటమి ప్రభుత్వ పాలనలో ఏడాదిలో 8 స్కూల్స్ మంజూరైనట్లు తెలిపారు.