News September 8, 2024

విశాఖ: తీవ్రవాయుగుండంగా మారనుందా?

image

కళింగపట్నానికి తూర్పున 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణశాఖ అధికారుల తెలిపారు. పూరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల సమీపానికి చేరిన వాయుగుండం చేరిందన్నారు. ఇది దాదాపు వాయవ్యంగానే పయనిస్తూ రేపు ఉదయానికి తీవ్రవాయుగుండంగా మారుతుందని అంచనా వేశారు. వేగంగా పయనిస్తున్నందున రేపు మధ్యాహ్నానికే పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.

Similar News

News October 9, 2024

విశాఖ నగరంలో ఏర్పాటు కానున్న TCS..ఎంపీ స్పందన

image

విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌కు విశాఖ ఎంపీ భరత్ శుభాకంక్షాలు తెలిపారు. ఈ మేరకు X వేదికగా స్పందిస్తూ టాటా గ్రూప్‌ను ఒప్పించారు. టీసీఎస్ ఏర్పాటు అయితే సుమారు పదివేల మంది స్థానిక యువతకి ఉపాధి లభిస్తుంది. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని చూపిస్తున్న చొరవకు ఎంపీగా అవసరమైనదంతా నేను చేస్తాను అని పేర్కొన్నారు.

News October 9, 2024

విశాఖ: సింహాద్రి అప్పన్న సన్నిధిలో సినీ హీరో

image

సినీ హీరో సుదీర్ బాబు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విశాఖ వచ్చిన మూవీ టీమ్ ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో మాట్లాడారు. అనంతరం సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News October 9, 2024

విశాఖలో హీరో సుధీర్ బాబు సందడి

image

విశాఖలో ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్ర బృందం బుధవారం సందడి చేసింది. ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర హీరో సుధీర్ బాబు మాట్లాడారు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారన్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిచంద్, షియాజీషిండే కీలక పాత్రలు పోషించారన్నారు. ఇది తండ్రి, కొడుకుల చుట్టూ తిరిగే కథ అని అన్నారు. ఈ నెల 11న విడుదల అవుతుందని చెప్పారు.