News July 4, 2024
విశాఖ: నాటు తుపాకీతో వీధి కుక్కను కాల్చి చంపాడు

కొండపాలెంలో నాటు తుపాకీతో వీధి కుక్కను కాల్చి చంపిన యాదగిరి నూకరాజును, అతనిని తీసుకువచ్చిన పెద్దాడ శ్రీనివాసరావును అరెస్టు చేశామని బుచ్చయ్యపేట ఎస్సై డి.ఈశ్వరరావు తెలిపారు. గ్రామంలోని వీధి కుక్క నాటు కోళ్లను తినేస్తోందని శ్రీనివాసరావు అనే వ్యక్తి కేపి. అగ్రహారానికి చెందిన నూకరాజును తీసుకువచ్చి అతని వద్ద ఉన్న నాటు తుపాకీతో వీధి కుక్కని కాల్చి చంపినట్లు స్థానిక వీఆర్వో ఫిర్యాదు చేశారన్నారు.
Similar News
News December 10, 2025
కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర శోభ

విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీచక్రనవావర్ణార్చన, లక్ష్మీహోమం జరిగాయి. గురువారంభక్తుల రద్దీ దృష్ట్యా పూజా సమయాలను కుదించినట్లు ఈవో తెలిపారు. భక్తులు ఆన్‌లైన్, వాట్సాప్ (9552300009) ద్వారా దర్శనం, ప్రసాదం బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 19 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశామని, వీఐపీలు, వృద్ధులు నిర్ణీత సమయాల్లోనే రావాలని కోరారు.
News December 10, 2025
ఏయూలో డిసెంబర్ 15 నుంచి ‘సరస్’ ఎగ్జిబిషన్: కలెక్టర్

మహిళల స్వయం సాధికారత కోసం డిసెంబర్ 15 నుంచి 26 వరకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ‘సరస్’ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. దేశవ్యాప్తంగా 600 మంది డ్వాక్రా మహిళలు 250 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హ్యాండ్‌లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ ప్రదర్శనను ఆదరించాలని కలెక్టర్ కోరారు.
News December 10, 2025
పేదల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: విశాఖ కలెక్టర్

విశాఖ జిల్లాలో పేదల గృహ నిర్మాణాలను వేగవంతం చేసి, మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో, రోజుకు 200 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. గడువులోగా పూర్తి చేయకపోతే ఇంటితో పాటు స్థలం పట్టా కూడా రద్దు అవుతుందని లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


