News July 31, 2024

విశాఖ నుంచి తిరుమలకు ప్రత్యేక బస్సు సర్వీసు

image

విశాఖ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి ప్రత్యేక బస్సు సర్వీసును నడపడానికి ఏపీ పర్యాటక సంస్థ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. ఆగస్టు 10న మధ్యాహ్నం 3 గంటలకు విశాఖలో ఈ బస్సు బయలుదేరుతుంది. 11 ఉదయాన్నే తిరుపతి చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్తారు. తిరుచానూరు, శ్రీకాళహస్తి దర్శనం అనంతరం విశాఖకు బయలుదేరుతుంది. పెద్దలకు రూ.6,300, పిల్లలకు రూ.6,000 చెల్లించాలి.

Similar News

News December 13, 2025

VZM: గుండె ఆగింది… కానీ చూపు కొనసాగింది

image

కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఓ వృద్ధుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. అయినా ఆయన కుటుంబం అంత శోకంలోనూ మానవీయతను చాటింది. చీపురుపల్లికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎంపీడీఓ కర్రోతు అప్పారావు (73) శుక్రవారం కంటి పరీక్షల కోసం విజయనగరానికి వెళ్లి అక్కడే కన్నుమూశారు. ఈ విషాదంలోనూ కుటుంబసభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. రెడ్‌క్రాస్, మానవీయత స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్నియా సేకరించారు.

News December 13, 2025

మానవత్వం చాటుకున్న VZM ఎస్పీ.. రోడ్డు ప్రమాద బాధితురాలికి తక్షణ సాయం

image

ఎస్పీ ఏఆర్.దామోదర్ గరివిడిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్నప్పుడు గుర్ల మండలం దుగ్గివలస గ్రామ సమీపంలో బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక మహిళను గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, గాయపడిన మహిళకు సపర్యలు చేశారు. అనంతరం ​అటుగా వస్తున్న ఆటోను చికిత్స కోసం నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

News December 13, 2025

24న జాతీయ వినియోగదారుల దినోత్సవం: VZM JC

image

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈనెల 24న నిర్వహించాలని విజయనగరం జేసీ ఎస్.సేథు మాధవన్ సూచించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18వ తేదీ నుంచి వినియోగదారుల వారోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈసారి ‘డిజిటల్ న్యాయపాలన, సమర్థ సత్వర పరిష్కారం’ ఇతివృత్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిషులో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు.