News November 30, 2025

విశాఖ: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్’

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నవంబర్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News February 13, 2026

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 22 వినతులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ నిర్వహించారు. ఈ ఓపెన్ ఫోరమ్‌లో 22 వినతులను జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు స్వీకరించారు. వీటిలో జోన్లు భీమిలి-1, మధురవాడ-3, ఈస్ట్-7, సౌత్-2, నార్త్-2, వెస్ట్-1, పెందుర్తి-2, గాజువాక-4 వినతులు ఉన్నాయి. సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News February 13, 2026

నగరంలో 291 మంది పోలీసులకు రివార్డులు

image

నగరంలోని గత నెలలో వివిధ కేసుల్లోని ప్రతిభ చూపించిన 291 పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబత్ర బాగ్చి రివార్డులు అందజేశారు. వివిధ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి సీఐ వరకు మెరిట్ ఆధారంగా గుర్తించి రివార్డులు క్రైమ్ మీటింగ్లో అందించారు. మిగతా సిబ్బంది వీరిని స్ఫూర్తిగా తీసుకొని విధి నిర్వహణలో మరింత పనిచేయాలన్నారు.

News February 13, 2026

విశాఖ: రేపు పాఠశాలల సెలవు రద్దు

image

జిల్లాలో ఫిబ్రవరి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తూ డీఈవో ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నెలకొన్న ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో ఒక రోజు సెలవు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.